
నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతి వాటాన్ని రుచి చూపించాడు. గతంలో కూడా పలు సందర్భాల్లో తన అభిమానులు మీద కోపపడి కొట్టిన సందర్భాలు అనేకం. ఇదే విషయాన్ని ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా దానికి ప్రతిస్పందనగా బాలకృష్ణ మాట్లాడుతూ నా అభిమానులు నేను కొట్టడాన్ని ఆనందిస్తారని అదేదో ఘనకార్యం మాదిరిగా చాలా గొప్పగా చెప్పుకున్నాడు బాలకృష్ణ. ఈరోజు అనంతపురం జిల్లా, హిందూపురం లో ఎన్నికల ప్రచారం సందర్బంగా అభిమానిపై మరల బాలకృష్ణ చేయిచేసుకున్నారు. హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో అభిమాని ఫోటో తీస్తుండగా బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసి అతనిపై చేయిచేసుకున్నారు. బాలకృష్ణ పర్యటన కు జనం లేకపోవడంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానులపై విరుచుకు పడుతున్నారు. ఏదేమైనా తన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది లేకపోతే అభిమానులే కాక ప్రజల్లో చులకన భావం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.

Comments are closed.