సికింద్రాబాద్: కంటోన్మెంట్ హరిత హారం లో కరోనా కలకలం రేగింది. రెండు రోజులు క్రితం జరిగిన హరిత హారంలో పాల్గొన్న నేతకు కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ విషయం తెలియడంతో బోర్డు మెంబర్లు హోమ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు.
అయితే మంత్రి తలసాని శ్రీనుకు కూడా కరోనా సోకి ఉండవచ్చనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్న విషయం విదితమే.
Comments are closed.