దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. తాజాగా, థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టినట్టు వివరించింది.
51.54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు తొలిస్థానం లభించినట్టు తెలిపింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 33.36 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 8.11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడోస్థానంలో ఉన్నట్టు థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ వెల్లడించింది.
అటు, పొలిటికల్ ల్యాబొరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో మరో విధమైన ఫలితాలు వచ్చాయి. దుబ్బాకలో బీజేపీదే విజయం అంటూ పొలిటికల్ ల్యాబొరేటరీ పేర్కొంది. బీజేపీకి 47 శాతం ఓట్లు లభించినట్టు తెలిపింది. 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్ రెండోస్థానంలో, 13 శాతం ఓట్లతో కాంగ్రెస్ మూడోస్థానంలో నిలిచినట్టు ఆ సంస్థ పేర్కొంది.
Tags: Dubbaka Exit Polls, Solipeta Sujatha, TRS BJP Congress
Comments are closed.