The South9
The news is by your side.

గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకం, అక్రమ రవాణా మరియు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ను పూర్తిగా అరికట్టాలి – యస్.పి. విజయ రావు, IPS., 

post top

గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకం, అక్రమ రవాణా మరియు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ను పూర్తిగా అరికట్టాలి – యస్.పి. విజయ రావు, IPS.,

after image

◆ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ రైడ్ నిర్వహించి మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు.
◆ అంతర్రాష్ట్ర, జిల్లాల తనిఖీ కేంద్రాలు వద్ధ విసృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు.
◆ గంజాయి, ఖైనీ, గుట్కా వంటి నిషేధిత ఉత్పత్తుల అక్రమ రవాణాను అరికట్టాలి.
◆ SEB వారితో కలిసి వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా దాడులు నిర్వహించాలి.
◆ IPL రాబోతున్న కారణంగా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశాలు.
◆ ప్రజలు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలి- అవగాహనతోనే ఆన్ లైన్ నేరాల నియంత్రణ.
◆ గతంలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన ముద్దాయిల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశాలు.
◆ ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఎందరో జీవితాలు దుర్భరంగా మారాయి..
◆ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశపడకండి. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలి.
◆ అదేవిధంగా ఆన్ లైన్ నేరాలు అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు జాగ్రత్త !.
◆ గుట్కా, గంజాయి, మాదకద్రవ్యాలు వంటి మత్తుపదార్ధాల బారిన పడితే జీవితం సర్వనాశనం అవుతాయని హెచ్చరించి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన.
◆ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
◆ గుట్కా అక్రమ రవాణా లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్100, సంబంధిత స్టేషన్ లేదా PRO. 9704594540 కార్యాలయంకు తెలియపరచగలరు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.