రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాలు ప్రత్యేకం, విభిన్నం. ఈ నేపద్యంలో నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతం అయిన ఉదయగిరి నియోజకవర్గo లోని మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబా నికి ప్రత్యేక స్థానం ఉంది.
దేశం లో నే భారీ రహదారుల వ్యాపారం రంగం లొనే ఉంటూ ప్రజా సేవలో ఎంపీ గా ఎమ్మెల్యే గా ఆ కుటుంబo నుంచి పెద్దాయన రాజమోహన్ రెడ్డి వారి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజా సేవలో ఉన్నారు.
ఈ నేపధ్యంలో రాజమోహన్ రెడ్డి వారసునిగా2014 ఎన్నికల్లో రాజకీయ అరంగ్రేటం చేశారు వారి పెద్ద కుమారుడు బిజినెస్ టైకూన్ మేకపాటి గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి గురుంచి చెప్పు కోవలిసివస్తే ముందుగా… జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి బాల్య మిత్రుడు.ఈయన విద్య విదేశాల్లో కొనసాగింది. గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో కి వచ్చేటప్పటికే క్షణం తీరిక లేకుండా గడిపే ప్రణాళిక ఆయన సొంతం. ఉదయం టిఫిన్ ముంబయి,మధ్యాహ్నం భోజనం వేరే దేశం లో ఇలా ఉండేది ఆయన దినచర్య. అలాంటి వ్యక్తి ప్రజా క్షేత్రం లోకి వస్తూ ఉండగానే కొన్ని విమర్శలు వచ్చాయి. ఎప్పుడు విమానాల్లో తిరిగే ఈయనకు ప్రజలు కు అందుబాటులో ఉంటాడా ఆయనను నమ్మవద్దని ప్రతి పక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. వాస్తవానికి ఆయన శాసన సభ్యుడు గా పోటీ చేసే సమయానికి తెలుగు మాట్లాడం చాలా తక్కువు తెలుసు.ఈ నేపద్యంలో 2014 ఎన్నికల్లో విమర్శలు ను పటాపంచలు చేస్తూ ఆత్మకూరు ప్రజలు ఆయనకు అఖండ విజయం ని అందించారు. మరల 2019 రెండో మారు శాసన సభ్యుని గా గెలిచి అతి ముఖ్యమైన ఐటీ భారీ పరిశ్రమ ల మంత్రి గా పదవి చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఎంతో నమ్మకం తో మొత్తం 6 శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా అన్ని శాఖల ను సమనవ్యయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో ప్రతి పక్షాలు పైన అప్పుడప్పుడు విమర్శలు చేయాలి.కానీ గౌతమ్ రెడ్డి ది విభన్న శైలి, ఆయన మాటలు హుందాగా ఉంటాయి ,ఆయన రాజకీయ లు గమనిస్తే “జెంటిల్మన్ పాలిటిక్స్” అనడంలో అతిశయోక్తి కాదు, ఈయన అభిమానులు ప్రేమతో యం. జి. ఆర్. అని పిలుచుకుంటారు. కొందరు ఆయితే “పొలిటికల్ జెంటిల్మన్”అని అంటారు. ఇలా అందరి మన్ననలు పొందుతు ముందుకు సాగుతున్న ప్రియతమ మంత్రి వర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి కి “ద సౌత్ 9” తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు?????….-ఎడిటర్
Comments are closed.