The South9
The news is by your side.

నా కుమారుడిని నేనే లాంచ్ చేస్తా: నందమూరి బాలకృష్ణ

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం సందర్భంగా నిన్న ఒక ఛానల్ తో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, సినిమాలు, రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అరంగ్రేటం, ఇలా రకరకాల అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తను ఏవేవి సినిమాలు తీయాలి అనుకుంటున్నారో వాటి గురించి మాట్లాడుతూ.. నర్తనశాల, ఆదిత్య 369, సినిమాలు తీయాలి అని అన్నారు. అయితే సౌందర్య లాంటి నటి లేదు కాబట్టి నర్తనశాల సినిమాను మొదలు పెడితే మిస్ క్యాస్టింగ్ అయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి నర్తనశాల సినిమా తీయక పోవచ్చు అని అన్నారు. ఇక ఆదిత్య369 విషయానికి వస్తే ఆ సినిమాకు సంబంధించిన కథని తనే స్వయంగా రాసుకున్నానని ఈ విషయాన్ని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కి తెలిపారని అన్నారు‌. ఆదిత్య 369 సీక్వెల్ కి సంబంధించి దర్శకత్వం విషయంలో అయితే దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాలని లేకుంటే తనే దర్శకత్వం వహిస్తానని అన్నారు. ఈ సూచన కూడా సింగీతం శ్రీనివాసరావు చేశారని చెప్పారు. ఇక ఈ సినిమాలో తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. తనకున్న అనుభవం అంతా రంగరించి తన కొడుకును తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో మోక్షజ్ఞ తో పాటు తను కూడా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ అన్నారు. అన్ని అనుకూలంగా కుదిరితే , తండ్రి కొడుకులు నటిస్తున్న మొదటి సినిమా ఆదిత్య 999 అవుతుంది.

Post midle

Leave A Reply

Your email address will not be published.