
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న జంట అక్కినేని నాగచైతన్య, సమంత. ఈ జంట పెళ్లి చేసుకొని రెండున్నరేళ్లు అవుతున్నా ఇంకా అమ్మానాన్నలు కాలేదు. దీంతో సమంత కావాలనే తన ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రస్టింగ్ విషయం తెర మీదకు వచ్చింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. బెంగళూరు నాగరత్నమ్మ కథతో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సమంత ప్లాన్ చేస్తుంది.

ఈ సినిమా కోసం అనుష్క సహా చాలా అందాల భామలను ట్రై చేసిన తరువాత సమంత దగ్గరకు వచ్చింది. అయితే సమంతకూడా ఈ సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఈ సినిమా కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. డెక్కన్ క్రానికల్‌లో వచ్చిన కథనం మేరకు సింగీతం ఓ బయోపిక్ కోసం సమంతను సంప్రదించాడు. సమంత చేసేందుకు ఓకే చెప్పినా ఫైనల్ నేరేషన్ అయిన తరువాతే సినిమాకు సైన్ చేయనుందని తెలుస్తోంది సమంత, నాగచైతన్యల పెళ్లి జరిగి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి సమంత ప్రెగ్నెన్సీ విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. మీడియా సంస్థల్లో సమంత ప్రెగ్నెన్సీ గురించి వచ్చిన వార్తలన్నీ రూమర్స్ అని కొట్టి పారేశారు.
జాను సినిమా ప్రమోషన్ సందర్భంగా ప్రెగ్నెన్సీ గురించి స్పందించింది సమంత. `నాకు పెళ్లైంది. పిల్లల గురించి ఆలోచించాలి. కానీ సినిమాల్లో హీరోయిన్ కెరీర్ చాలా చిన్నది. అందుకే నేను అమ్మ అయ్యేందుకు మరో రెండు, మూడేళ్లు పట్టొచ్చు అంటూ కామెంట్ చేసింది. దీంతో తన కెరీర్ కోసమే సమంత ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తుందా అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
Comments are closed.