అమరావతిలో శాసన రాజధాని కూడా అవసరం లేదని మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ రాజ్యసభసభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందిస్తూ… కొడాలి నానితో ఆ మాట చెప్పించడం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. రాజధాని అంశం కోర్టుల పరిధిలో ఉన్న సమయంలో… న్యాయస్థానాలను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు.
పేదలకు భూములు పంచే నెపంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తోందని కనకమేడల మండిపడ్డారు. కోర్టులు తమ నిర్ణయాలను అడ్డుకుంటాయని ప్రభుత్వానికి ముందే తెలుసని… కావాలనే న్యాయస్థానాలను కూడా రాజకీయాల్లోకి లాగాలని చూస్తోందని అన్నారు. పేదలకు భూములు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కట్టించిన దాదాపు 6 లక్షల ఇళ్లను ఎందుకు పంచలేదని అడిగారు. పేదలకు సెంటు భూమి ఇస్తే సరిపోతుందని చెపుతున్న వైసీపీ పెద్దలు… పెద్దపెద్ద భవంతుల్లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అంతర్వేది ఆలయరథం దగ్ధం ఘటనతో ప్రభుత్వం మతపరమైన క్రీడ ఆడాలని చూస్తోందని విమర్శించారు.
Tags: Kanaka medala Ravindra Kumar, Chandrababu, Telugudesam, Kodali Nani, YSRCP, Amaravati
Comments are closed.