
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ని చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే దీని తర్వాత రెండు ప్రాజెక్టు లను ఒకే చేసినట్టు సమాచారం. ఈ మధ్య పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు, దానికి ప్రతి స్పందన గా పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్ట్స్ మెగా ప్రాజెక్టు అన్నట్టు చెప్పడం తో మెహర్ రమేష్ తో చిరంజీవి చేస్తున్న ట్లు అర్ధం అయింది. ఈ నేపథ్యంలో తమిళ హీరో అజిత్ చేసిన వేదళం సినిమాని రీమేక్ చేస్తున్న ట్లు సమాచారం.

అయితే మెహర్ రమేష్ కెరీర్ ని పరిశీలిస్తే ఒక ప్రభాస్ నటించిన బిర్లా తప్ప ఆయన తీసిన సినిమా లు అన్ని అంత గా మంచి ఫలితాలు ను ఇవ్వలేదు. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా అనగానే అభిమానుల్లో కలవరం స్టార్ అయింది.అందులోనూ చాలా కాలం గా మెగా ఫోన్ కి దూరంగా ఉన్నాడు మెహర్. ఇప్పుడు ఈ వేదళం తో ముందుకు వస్తున్నాడు. అయితే చిరంజీవి తో సినిమా అంటే వ్యవహారం అంత ఆషామాషీ గా ఉండదు. ప్రతి విషయం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు.చిరంజీవి ఇన్వాల్మెంట్ ఉంటుంది, కాబట్టి అంత సందేహ పడనవసరం లేదు. అభిమానుల కు మెహర్ మంచి హిట్ తో రీ ఎంట్రీ ఇచ్చి మెగా అభిమానులు అందరిని అలరించాలని ఆసిద్ధం.
Comments are closed.