The South9
The news is by your side.

గుండెపోటుతో కన్నుమూసిన నటుడు జయప్రకాశ్ రెడ్డి

  • ఈ ఉదయం స్నానాల గదిలో కుప్పకూలి మరణించిన జయప్రకాశ్
  • బ్రహ్మపుత్రుడు సినిమాతో టాలీవుడ్‌లోకి
  • శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ
Post Inner vinod found

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రాయలసీమ యాసతో విలన్ పాత్రల్లో  ఒదిగిపోయే జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. లాక్‌డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన ఈ ఉదయం స్నానాల గదిలో కుప్పకూలి  మరణించారు.

జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సిరివెళ్ల. 8 మే 1946లో జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి వెంకటేశ్ నటించిన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. జయప్రకాశ్ రెడ్డి మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

Post midle

Leave A Reply

Your email address will not be published.