వాస్తవాలే చెబుతాం…నిజాలే మాట్లాడతాం: పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
“గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కామెంట్స్”
గతంలో ఈడీబీ ర్యాంకులు వచ్చిన విధానం వేరు..ఇప్పుడు వేరు
* మొట్టమొదటిసారి సర్వే చేసి ఫలితాలిచ్చారు
* ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిచింది
* గతంలో లాగా నెంబర్ వన్ ర్యాంకును పొరుగు రాష్ట్రాలతో పంచుకోలేదు
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఈ అరుదైన అగ్రస్థానం దక్కింది
* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన సర్వే లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది
* కరోనా అనంతరం పరిశ్రమలు మళ్లీ గాడిన పడేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను సీఎం జగన్ కల్పించారు
* సీఎం ప్రోత్సాహం… పరిశ్రమల శాఖ అధికారుల కృషితో రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం
* కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించగానే లోకేష్ ట్వీట్ చూసి ఆశ్చర్యపోయాను
* 10 వ తరగతి ఫలితాలు ప్రకటించిన రోజు నారాయణ స్కూల్ తరహాలో చేశారు..
* మా వల్లే ర్యాంక్ వచ్చింది అని ప్రచారం చేసుకున్నారు
* మేము అధికారంలోకి వచ్చే నాటికి పరిశ్రమలకు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోయాయి
* మా ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.4-5 వేల కోట్ల వరకు చెల్లించాం
* రుణాల రీషెడ్యూల్ చేయడం ద్వారా 10 వేల ఎమ్ఎస్ఎమ్ఈలకు ఊపిరి పోశాం
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు.. అమాయకులు అని లోకేష్ అనుకుంటున్నారు
* రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారు, చేస్తున్నారు
* సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో మొదటి ర్యాంకు సాధించడంపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు?
* గత ప్రభుత్వం 32 లక్షల కోట్ల ఒప్పందాలు చేశామని గొప్పగా చెప్పింది.. అందులో 50 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు
* ‘కియా’ని తెచ్చినందుకు గత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కానీ, 20 ఏళ్ళపాటు ప్రభుత్వం పెనాల్టీ కట్టేలా రాయితీలు పెట్టారు
* పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పారిశ్రామిక వేత్తలు సంతోషంగా ఉన్నారు
* ఈడీబీ కోసం అసలు సర్వే, ప్రక్రియ మొత్తం 2019 ఏప్రిల్ నుండి 2020 మార్చి వరకు జరిగింది
* ఈ సమయంలో ఎవరి ప్రభుత్వం ఉంది?
* ఇదంతా 7,800 మందితో కేంద్రం సర్వే జరిపింది
* గతంలో ప్రభుత్వం ఎవరి ని సూచిస్తే వారినే సర్వే చేశారు..ఇప్పటిలా గతంలో ఎప్పుడూ సర్వే జరగలేదు
* అది కూడా కేవలం 10 శాతం మాత్రమే సర్వే
* పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కరికాల వలవన్, సుబ్రహ్మణ్యం జవ్వాదిలను ప్రశంసించిన మంత్రి గౌతమ్ రెడ్డి
* ఏఏ జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి… పరిశ్రమల అవసరాలకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నాం
* పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం
* కరోనా దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటునిచ్చింది
* కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా వీడియోను మీడియాకు ప్రదర్శించి చూపించిన మంత్రి మేకపాటి
* 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశం ప్రపంచంలో 157వ స్థానంలో ఉంది
* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంస్కరణలు తీసుకురావాలని నాడు దిశానిర్దేశం చేశారు.
Comments are closed.