The South9
The news is by your side.

జనసేన ప్రతినిధులుగా శరత్ కుమార్, వివేక్ బాబు నియామకం

post top
  • మీడియా చానళ్ల చర్చల్లో పాల్గొనేందుకు ప్రతినిధుల నియామకం
  • ఇరువురికీ పవన్ అభినందనలు
  • మీడియాలో గళం బలంగా వినిపించాలని కోరుకుంటున్న జనసేన
after image

మీడియా చర్చా కార్యక్రమాల్లోనూ తమ గళాన్ని బలంగా వినిపించాలని కోరుకుంటున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మీడియా చానళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతినిధులుగా కోటమరాజు శరత్ కుమార్, పి.వివేక్ బాబులను నియమించారు.

వీరిద్దరికీ పవన్ తన అభినందనలు తెలియజేశారు. విజయవాడకు చెందిన శరత్ కుమార్ ఓ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వివేక్ బాబు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. ఆయన గతంలో ఓ న్యూస్ చానల్ కు రిపోర్టర్ గా వ్యవహరించారు.
Tags: Janasena, DebatesTV Channels, Pawan Kalyan, Andhra Pradesh

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.