సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో తీసిన మొదటి చిత్రం రంగీల. ముక్కోణపు ప్రేమ కథ చిత్రం గా మలచిన ఈ చిత్రం లో అమీర్ ఖాన్, ఊర్మిళ, జాకీ ష్రఫ్ ముఖ్య పాత్ర దారులు గా నటించారు. ఈ చిత్రం విడుదల అయ్యి నేటికి 25 సం”పూర్తి చేసుకుంది.1995 సెప్టెంబర్ 8 న విడుదలై సంచలనానికి తెర లేపింది రంగీల. ఈ చిత్రాన్ని కి చాలా ప్రత్యేక తలు ఉన్నాయి. సంగీత దర్శకుడు గా ఏ ఆర్ రెహమాన్ కి ఇది మొదటి హిందీ చిత్రం .ఈ సినిమా కి రెహమాన్ స్వరపరిచిన గీతాలు మరియు రీ రికార్డింగ్ తో సినిమాని వేరే లెవల్ కి తీసుకెళ్ళేడు అంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రం తరువాత బాలీవుడ్ లో పాగా వేశాడు రెహమాన్. అలానే ఈ చిత్రాన్ని కి ప్రధాన ఆకర్షణ ఊర్మిళ తన సహజ నటన తో పాటు తన అందచందాలతో యావత్ భారత యూత్ సినీ అభిమానులు ను ఒక ఊపు ఊపింది ని చెప్పవచ్చు.
ఊర్మిళ కోసం చాలామంది ఎన్నో సార్లు ఈ చిత్రాన్ని చూసురు. కథానాయకుడిగా నటించిన అమీర్ ఖాన్ నటన అందరి హృదయ లను కొల్లకొట్టడు. బ్లాక్ టికెట్స్ అమ్ముకునే మున్నా అనే యవకుడు, మిలి అనే అల్లరి పిల్ల పరిచయం, వారి మధ్య ప్రేమ, మిలి హీరోయిన్ అవ్వడం ఒక సూపర్ స్టార్ మిలి ని ప్రేమించడం. లాస్ట్ కి మిలి మున్నా తో ఒకటవ్వడం ఇలా త్రిముఖ ప్రేమ కథ గా మలచిన రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని అద్బుతంగా మలిచాడు.రెహమాన్ స్వరపరచిన గీతాలు. ఉర్రు తలు ఊపుయి. ఇప్పటికి ఆ గీతలు వినిపిస్తూనే వుంటాయి. ఇలాంటి చిత్రాన్ని మాత్రం రామ్ గోపాల్ వర్మ నుంచి ఇప్పుడు ఆశించడం ఆశ భంగ మే.
Comments are closed.