The South9
The news is by your side.
after image

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ స్పందన కార్యక్రమం

post top

అమరావతి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ స్పందన కార్యక్రమం: క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన సీఎం.కోవిడ్‌–19, గ్రామ–వార్డు సచివాలయాలు, ఉపాధి హామీ పనులు – గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం, స్కూళ్లు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులలో నాడు–నేడు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ తదితర అంశాలపై సీఎం సమీక్ష. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి ఏమన్నారంటే..:

1). కోవిడ్‌–19:

– కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
– వాక్సీన్‌ వచ్చే వరకు కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
– అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలి.
– పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులతో పాటు, అన్ని ప్రభుత్వ సార్వజన ఆస్పత్రుల (జీజీహెచ్‌)లో కోవిడ్‌ పరీక్షల నిర్వహణ తప్పనిసరి:
– కోవిడ్‌ వస్తే ఏం చేయాలి? ఎవరికి ఫోన్‌ చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అన్న విషయాలు తెలియని వారెవ్వరూ రాష్ట్రంలో ఉండకూడదు.

104 కాల్‌ సెంటర్‌–మాక్‌ కాల్స్‌:
– కోవిడ్‌ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్‌ సెంటర్‌ను ఉపయోగించుకోవాలి.
– ఆ నెంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.
– ఆ కాల్‌ సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్‌కు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే స్పందించాలి:
– ఆ ఫోన్‌ కాల్స్‌పై ఎలా స్పందిస్తున్నామన్నది మన పనితీరుకు అద్దం పడుతుంది:
– కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా స్పందిస్తున్నామన్న దానిపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి:
– జిల్లా కలెక్టర్లు, జేసీలు ప్రతి రోజూ 104 కాల్‌ సెంటర్లకు, జిల్లా కోవిడ్‌ సెంటర్లకు మాక్‌ కాల్స్‌ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత ఉన్నదా అన్నది పరీక్షించాలి.

కోవిడ్‌ పరీక్షలు:
– ఆర్‌టిపీసీఆర్, ట్రూనాట్‌ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటల్లోగా, ర్యాపిడ్‌ పరీక్షలో 30 నిమిషాల లోపు ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి.
– జిల్లాల్లోని అన్ని ల్యాబ్‌లకు అవసరమైన పరికరాలు అందించినందువల్ల ఎక్కడా కిట్‌లు లేవన్న పేరుతో పరీక్షలకు నిరాకరించవద్దు.
– కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు ఉన్న వారిని ఖచ్చితంగా హోం క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి:
– కోవిడ్‌ సోకిన వారు ఆస్పత్రికి వస్తే అరగంటలో బెడ్‌ కేటాయిస్తున్నామా? లేదా? చూడాలి

కోవిడ్‌ ఆస్పత్రులు–ప్రమాణాలు:
– రాష్ట్రంలో దాదాపు 224 కోవిడ్‌ ఆస్పత్రులు పని చేస్తున్నాయి. వాటన్నింటిలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.
– ఆ ఆస్పత్రులలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, తగిన సంఖ్యలో వైద్యులు, నర్సులు ఉన్నారా? లేరా?. ఈ నాలుగు ప్రమాణాలు ఎలా ఉన్నాయన్న దానిపై కలెక్టర్లు, జేసీలకు ఎప్పటికప్పుడు నివేదికలు రావాలి.
– అదే విధంగా హెల్ప్‌ డెస్క్‌లు ఎలా పని చేస్తున్నాయన్నది కూడా చూడాలి.

Post midle

తాత్కాలిక సిబ్బంది:
– కోవిడ్‌ నివారణ చర్యలలో భాగంగా అన్ని జిల్లాలోని కోవిడ్‌ ఆస్పత్రులలో 6 నెలల కోసం తాత్కాలిక ప్రాతిపదికన దాదాపు 17 వేల మంది వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది నియామకం
– వారితో పాటు మరో 11 వేల మంది శిక్షణ నర్సులను నియమించాలని ఆదేశాలు ఇచ్చాం. ఆ విధంగా తాత్కాలిక ప్రాతిపదికన దాదాపు 28 వేల సిబ్బంది నియామకం జరుగుతోంది.
– ఆ మేరకు వెంటనే ఆ నియామకాలన్నీ పూర్తయ్యేలా చూడడంతో పాటు, డ్యూటీలో చేరిన వారు సక్రమంగా విధులకు హాజరవుతున్నారా? అన్నది కూడా చూడాలి.

కిట్‌లు–పర్యవేక్షణ:
– కోవిడ్‌ రోగులకు కిట్‌లు పక్కాగా ఇవ్వాలి. ఆ కిట్‌లో అన్నీ ఉన్నాయా? లేవా? అన్నవి చూడాలి.
– హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి ఆ కిట్‌లు (హోం కిట్‌) అందుతున్నాయా? లేదా? అన్నది కూడా చూడాలి.
– కోవిడ్‌ ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లతో పాటు, హోం ఐసొలేçషన్‌లో ఉన్న వారికి సేవలు ఎలా అందుతున్నాయన్న దానిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద చూపాలి.

ఆక్సీజన్‌ బెడ్లు:
– ఇవాళ రాష్ట్రంలో 26,250 ఆక్సీజన్‌ బెడ్లు ఉన్నాయి. 350 బెడ్ల నుంచి మొదలు పెట్టి ఈ స్థాయికి చేరుకున్నాము.
– రాష్ట్రంలో మొత్తం 31,589 బెడ్లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాబట్టి, ఇంకా 5,339 బెడ్లు ఏర్పాటు కావాల్సి ఉంది. ఆ మేరకు చర్యలు చేపట్టండి.

ప్లాస్మా థెరపీ:
– అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ప్లాస్మా థెరపీకి అనుమతి ఇచ్చాం. కాబట్టి
ప్లాస్మా థెరపీ కోసం ఆ ప్లాస్మా దాతల వివరాలు సేకరించి, డేటా సిద్ధం చేయాలి. ఆ సమాచారం అన్ని ఆస్పత్రులకు అందుబాటులో ఉండాలి.
– అయితే ఇక్కడ ఎవరి నుంచి ప్లాస్మా సేకరిస్తున్నామో, వారి ఆరోగ్యానికి సంబంధించిన కనీస ప్రమాణాలు చూడాలి.

2). గ్రామ–వార్డు సచివాలయాలు:

– గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలు చేస్తున్నాం:
– ప్రతి సచివాలయ ఉద్యోగి కచ్చితంగా సచివాలయంలోనే కూర్చుని విధులు నిర్వహించాలి:
– గ్రామ వాలంటీర్లు కూడా వారంలో కనీసం మూడు రోజుల పాటు సచివాలయంలో హాజరు ఇవ్వాలి, ఏ సమయంలో అయినా సరే వారు హాజరు ఇవ్వవచ్చు:
– జేసీలు పర్యవేక్షించి, ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులను భర్తీ చేయాలి:
– ప్రభుత్వ పథకాలను అమలు చేసే సందర్బంలో వాలంటీర్‌ అందుబాటులో లేకపోతే ఇబ్బందులు వస్తాయి.

నిర్దిష్ట సమయంలో సేవలు:
– గ్రామ సచివాలయాల్లోని ప్రతి సేవ నిర్దిష్ట సమయంలో పూర్తి అవుతుందా? లేదా? అని కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలి.
– కలెక్టర్లు, జెసిల పనితీరును దీని ఆధారంగానే పరిగణలోకి తీసుకుంటాం:
– ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించి ఇచ్చిన టైం లైన్‌లోనే పనిచేయాలి.
– ప్రభుత్వం ప్రకటించిన నిర్దిష్ట సమయంలో 91 శాతం రైస్‌ కార్డులను ఇస్తున్నాం. 76.60 శాతం ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. 97 శాతం పెన్షన్లు మంజూరు జరుగుతోంది. ఇవన్నీ నూరు శాతం జరిగేలా చూడాలి.
– ఇంటి స్థలాలకు సంబంధించిన దరఖాస్తులు 90 రోజుల్లో పూర్తి కావాలి.
– అర్హత ఉన్న వారికి నిర్దిష్టమైన సమయంలో మంజూరు ఇవ్వలేకపోతే కలెక్టర్లు, జేసీలు బాధ్యత వహించాలి.

Post Inner vinod found

ఫీల్డ్‌ విజిట్‌:
– కలెక్టర్లు వారానికి రెండు సార్లు గ్రామ సచివాలయాలకు ఖచ్చితంగా వెళ్ళాలి.
– వారానికి నాలుగు సార్లు జేసీలు వార్డు, గ్రామ సచివాయాలను సందర్శించాలి.
– సంబంధిత విభాగాల అధిపతులు (హెచ్‌ఓడీ), కార్యదర్శులు కూడా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకు రెండు సార్లు సందర్శించాలి.
– ఇది ఖచ్చితంగా జరగాలి. దీన్ని సీఎం కార్యాలయం నుంచి స్వయంగా పర్యవేక్షిస్తాం.

కాల్‌ సెంటర్‌:
– రెండు వందల మందితో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. ఈ సెంటర్‌ ఇప్పటికే పని చేస్తోంది. వార్డు, గ్రామ సచివాలయాల్లో జరుగుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది.
– సచివాలయం, మండల, జిల్లా స్థాయి వరకు ఆ కాల్‌ సెంటర్‌ పరిధిలోకి వచ్చారు.
– హెచ్‌ఓడి, సెక్రటరీ స్థాయి వరకు కూడా ఆ కాల్‌ సెంటర్‌ పరిధిలోకి తీసుకురాబోతున్నాం.

పోస్టుల భర్తీ–పరీక్షలు:
– గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న 16208 పోస్ట్‌లకు ఈనెల 25, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించబోతున్నాం. ఆ పరీక్షల కోసం 228 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం.
– ఆ పోస్టుల కోసం మొత్తం 10.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి
– కోవిడ్‌ నేపథ్యంలో పరీక్షలు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలి.

సమాచారం ప్రదర్శన:
– కోవిడ్‌ కాల్‌ సెంటర్‌ నెంబర్లతో సహా, అన్ని ముఖ్యమైన ఫోన్‌ నెంబర్లు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి.
– అదే విధంగా ప్రభుత్వ పథకాల క్యాలెండర్‌ కూడా ప్రదర్శించాలి.
– ఇంకా అన్ని పథకాల లబ్ధిదారుల వివరాలు కూడా తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి.
– కోవిడ్‌–19 నివారణ చర్యలపై కూడా పోస్టర్లు, హోర్డింగ్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.

జగనన్న తోడు:
– వచ్చే నెల ఈ పథకం ప్రారంభం. వీ«ధుల్లో చిల్లర వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులు జారీ
– వారికి రూ.10 వేల రుణం వడ్డీ లేకుండా మంజూరు.
– ఈ పథకం కోసం ఇప్పటి వరకు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి
కలెక్టర్లు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

వైయస్సార్‌ బీమా:
– సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే పూర్తి చేయాలి.
– లబ్ధిదారులతో బ్యాంక్‌ ఖాతాలు తెరిపించాలి.

వైయస్సార్‌ ఆసరా:
– పథకంలో దాదాపు 90 లక్షల మందికి ఆర్థిక సహాయం
– అక్క చెల్లెమ్మలకు వ్యాపారంలో తోడ్పాటు అందించే విధంగా పలు సంస్థలతో ఒప్పందం.
– బ్యాంకులతో కలెక్టర్లు మాట్లాడాలి.
– జిల్లాలలో మంత్రులు, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలి.
– ఇది చాలా పెద్ద మహిళా సాధికార కార్యక్రమం. దీనిపై మరింత అవగాహన కల్పించాలి.

3). జాతీయ ఉపాధి హామీ పథకం:

– నరేగాకు సంబంధించి రాష్ట్రానికి 4.25 కోట్ల పని దినాలు అదనంగా వచ్చాయి.
– దీనితో పాటు అదనంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కూడా పెరుగుతుంది.
– రూ.4 వేల కోట్లకు సంబంధించిన మెటీరియల్‌ కాంపోనెంట్‌కు అవకాశం ఉంది.
– ప్రతి జిల్లాలో ప్రతి వారంలో రూ.10 కోట్లు మెటీరియల్‌ కాంపోనెంట్‌ వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టాలి.
– పేమెంట్లు కూడా ఈ నెలలో పెండింగ్‌ లేకుండా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం.
– గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను పూర్తి చేయడం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు, స్కూల్‌ కాంపౌండ్‌లను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి.
– ఈ నెలాఖరు నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేయాలి.
– అక్టోబరు నుంచి డ్రైన్స్‌. గతంలో ఒక శాతం పనులు జరిగి, నిలిపివేసిన వాటికి కూడా అనుమతి ఇవ్వాలి.
– రూ.2 వేల కోట్ల పనులు ఒక శాతం కన్నా ఎక్కువ ఖర్చు చేసినవి ఉన్నాయి. వాటికి కూడా అనుమతులు ఇస్తాం.
– అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు స్థలాల గుర్తింపు పూర్తి చేయాలి.
– కొత్తగా 16 టీచింగ్‌ ఆసుత్రులను నిర్మించబోతున్నాం.
– వచ్చే నెలలో వాటికి టెండర్లు జరుగుతాయి.
– మన వద్ద మొత్తం 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. వాటికి కొత్తగా 16 కలిస్తే మొత్తం 27 టీచింగ్‌ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయి.

4). నాడు–నేడు
(స్కూళ్లు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులు)
– స్కూళ్లలో నాడు–నేడు కు సంబంధించి తొమ్మిది అంశాలతో పాటు కిచెన్‌ కూడా జత చేశాం.
– అక్టోబర్‌ 5న స్కూల్స్‌ తెరిచే అవకాశం ఉంది కాబట్టి, నాడు–నేడులో చేపట్టిన పనులను ఈనెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలి.
– నాడు–నేడు పనుల్లో క్వాలిటీపై కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలి
– 1085 టాయిలెట్లపై శ్లాబ్‌ వేయాల్సి ఉంది. వాటిని కూడా పూర్తి చేయాలి.

అంగన్‌వాడీ కేంద్రాలు:
– 55,607 అంగన్‌ వాడీ కేంద్రాల్లో కూడా నాడు–నేడు కింద వసతుల ఏర్పాటు చేయబోతున్నాం.
– వాటిని వైయస్‌ఆర్‌ ప్రీప్రైమరీ స్కూల్స్‌ కింద మార్చబోతున్నాం.
– ఈ కేంద్రాల్లో కూడా పది అంశాల్లో అన్ని నాడు – నేడు పనులు చేపడతాం
– 22,979 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. వాటికి నూతన భవనాలను సమకూర్చాలి.
– 11,961 చోట్ల అంగన్‌వాడీలకు స్థలం గుర్తించడం జరిగింది.
– 12,018 చోట్ల స్థలం కేటాయించాల్సి ఉంది, కలెక్టర్లు, జేసీలు త్వరగా స్థలాలను గుర్తించాలి.
– ఈనెల 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
– ప్రైమరీ స్కూళ్ళలో స్థలం అందుబాటులో వుంటే, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
– 1200 నూతన భవనాలు పూర్తయ్యే స్థితిలో వున్నాయి.

టీచింగ్‌ ఆస్పత్రులు:
– రాష్ట్రంలో కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తుండగా, వాటిలో ఇప్పటి వరకు 6 ఆస్పత్రులకు సంబంధించి ఇంకా భూసేకరణ జరగలేదు.
– ఏలూరు, పులివెందుల, అదోని, పిడుగురాళ్ల, మదనపల్లి, అమలాపురంలో వెంటనే భూసేకరణ జరగాలి.
– కాబట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు చొరవ చూపాలి.

5). ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు:

– అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి నాడు, 35 షెడ్యూల్డ్‌ మండలాల్లో ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం.
– ఆ మేరకు జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
– సరిహద్దులను గుర్తించడం, సరిహద్దు రాళ్ళను వేయడం, లబ్ధిదారులను వారికి కేటాయించిన భూమి వద్ద నిలబెట్టి పోటోలు తీయడం, రికార్డుల్లో దానిని నమోదు చేయడం, వెబ్‌ ల్యాండ్, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ డెటా బేస్‌లో ఈ వివరాలను నమోదు చేయడం పూర్తి చేయాలి.

Post midle

Comments are closed.