కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్ర టీజర్ విడుదల చేసారు చిత్ర యూనిట్. హీరో యాష్ జన్మదిన సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసారు.ఒక ప్రాంతీయ చిత్రం గా విడుదల అయ్యి భారత దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది kgf చిత్రం. ఒక సినిమా తో యాష్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో మొదటి kgf కి కొనసాగిపుంగా kgf2 ఉంటుంది అని ముందుగా నే చెప్పేరు ఈ సినిమా మేకర్స్.
మొదట వచ్చిన విజయం తో భారీ స్థాయిలో రొండు వ భాగాన్ని తెరకెక్కుస్తున్నారు. ఈ నేపద్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్, రవీనా తదితరుల తో పాన్ ఇండియా మూవీ గా తీస్తున్నారు. కరోనా వల్ల కొన్ని రోజుల విరామం తర్వాత మరల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన టీజర్ లో మొదటి భాగంగా లోని తల్లి పాత్ర ను చూపిస్తూ..ఇందిరా గాంధీ వేషధారణ చేసిన రవీనా ట్యాండెన్ పాత్రను,హీరో మిషన్ గన్ తో భారీ వాహనాలను కాల్చుతూ… చివరకి ఆ గన్ లోని వేడి తో సిగరెట్ వెలిగిచ్చు కుంటు ఉండే సీన్ తో టీజర్ ని ముగించాడు దర్శకుడు. ఈ టీజర్ ఉదేశ్యం హీరో కి జన్మదిన శుభాకాంక్షలు కోసమని చెబుతూనే హీరో ఎలివేషన్ ఎలా ఉంటుంది అనేది చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
Comments are closed.