సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పునఃప్రారంభమైంది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ చిత్రం షూటింగ్ గత కొన్నినెలలుగా నిలిచిపోయింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న షూటింగ్ కు హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు.
సెట్స్ పై బన్నీ ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ పంచుకుంది. “యోవ్… పుష్పరాజ్ ఒచ్చేసినాడు… ఇక చూస్కోండి!” అంటూ చిత్తూరు జిల్లా యాసలో ట్వీట్ చేసింది. పుష్ప చిత్రంలో బన్నీ చిత్తూరు జిల్లా లారీడ్రైవర్ గా పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బన్నీ పక్కన రష్మిక మందన హీరోయిన్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Comments are closed.