- ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సినీ ప్రముఖుల పేర్లు
- నమ్రత పేరు ఉందని వెల్లడించిన జాతీయ చానళ్లు
- నమ్రత పేరు వినిపించడంతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్
బాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్న డ్రగ్స్ విచారణ కేసు ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే నటీనటుల జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు బయటకు రావడం కలకలం రేపింది.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. జాబితాలో నమ్రత పేరు ఉందంటూ జాతీయ చానళ్లు సంచలన వార్తను వెల్లడించాయి. నమ్రత పేరు వినిపించడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి 25 మంది పేర్లను వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సినీ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన పేర్లలో కరీనా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఉండటం గమనార్హం.
Jaya Saha summoned again by NCB, actor Namrata Shirodkar's name surfaces in drug probe linked to #SushantSinghRajputDeathCase#SushantSinghRajput #ITVideos pic.twitter.com/j65Qe57m4Q
— IndiaToday (@IndiaToday) September 22, 2020
Comments are closed.