తెలుగు ఎలక్ట్రానిక్ న్యూస్ మీడియాలో టీవీ9 ఒక దిక్సూచి. అప్పట్లో టీవీ9 ఒక సంచలనం. ఏ కష్టం వచ్చినా తెలుగు ప్రజలు టీవీ9 వెంట నడిచేవారు. కార్పొరేట్ విద్యా సంస్థల దుర్మార్గం నుంచి కామాన్ మాన్ నలిగిపోయే కరప్షన్ దాకా ఏ సమస్యోఛ్చినా అందరికీ టీవీ9 ఒక పెద్ద దిక్కు. జనం బాధలు, కష్టాలే టీవీ9 హెడ్ లైన్స్. ఈ క్రెడిట్ కు అప్పటి కమిటెడ్ టీవీ9 టీమ్ కే దక్కుతుంది. టీవీ9 ట్రెండ్ సెట్ చేసేది మిగతా మీడియాలు దాన్ని ఫాలో అయ్యేవి. ఇదంతా గతం. ఓడలు బళ్లు బళ్లు ఓడలు అవుతాయంటారు. అలానే రవిప్రకాష్ నిష్క్రమణతో అప్పటిదాకా అనామకులుగా ఉన్న రజనీకాంత్, మురళీకృష్ణ లకు లీడర్షిప్ లోకి రావడానికి అవకాశం వచ్చింది. ఇద్దరూ ఇద్దరే… ఆశపోతులే! … స్థాయికి మించి దూరాశాపరులని మీడియా సర్కిల్స్ టాక్.
రజనీకాంత్ మహాన్యూస్ లీడ్ చేయడానికి వెళ్లి ప్లాపయ్యి వెనక్కి రాగా మురళీకృష్ణ సాక్షి టీవీకి వెళ్లి మోకాళ్ళ చిప్పలు పగులగొట్టుకున్నాడు. ఎట్లీస్ట్ రజనీకాంత్ కు కనీసం తప్పో, ఒప్పో ప్రయోగాలు చేసే చొరవ, ఏదో చెయ్యాలనే తెగువైనా ఉంటే మురళీకృష్ణకు అధికారం మీద యావ తప్ప ఇంకేముండదని మీడియా సర్కిల్స్ లో చెబుతారు. రవిప్రకాష్ చేసిన కొన్ని తప్పిదాలే (అవి ఇక్కడ అసందర్భం…) ఈ ఇద్దరినీ అందళమెక్కించాయి. ఈ ఇద్దరిమధ్య మళ్లీ పవర్ ఫైట్ జరిగింది….వళ్ళు వంగని మురళీకృష్ణ కంటే రజనీకాంత్ బెటర్ లీడర్ గా టీవీ9 ని టేకోవర్ చేసిన కొత్త యాజమాన్యం ఫీలైంది. వెంటనే రజనీకాంత్ ని మేనేజింగ్ ఎడిటర్ గా డిక్లేర్ చేశారు. ఏమాటకామాట చెప్పుకోవాలి, రవిప్రకాష్ ఉద్వాసన, పోలీసు కేసులు, టీవీ9 సంస్థలో రవిప్రకాష్ వీర విధేయులని హ్యండిల్ చేయడం వగైరా పోస్ట్ క్రైసిస్ ని రజనీకాంత్ మొత్తంగా బాగానే హ్యాండిల్ చేసాడు. దాదాపు యేడాదిపాటు రేటింగ్స్ చెక్కు చెదరలేదు. కరోనా కలికాలంలో సైతం కనీవినీ ఎరుగని రేటింగ్స్ రావడం దేశ వ్యాప్త సంచలనమైంది. మురళీకృష్ణ ఎన్ని వేషాలు వేసినా ఎన్ని నిష్టురాలాడినా, మిత్రులుగా ఉన్న కొందరు కొలీగ్స్ ఎన్ని కుట్రలు చేసినా ఓ పక్క కంటెంట్ ని చక్కబెడుతునే వాటిని కూడా రజనీకాంత్ గట్టి గానే ఎదుర్కొన్నారు. అంతా బాగానే ఉందని సంస్థలో పనిచేసే ఉద్యోగులు సంతోషపడ్డారు. సరిగ్గా ఇక్కడే ఒక క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి.
కొత్త యాజమాన్యం ప్రతినిధి(సిఓఓ)గా ఎంటరైన గొట్టిపాటి సింగా రావు “చాపకింద నీరులా ” టీవీ9 స్వరూపాన్ని మార్చుకుంటూ పోయాడు. మొదట్లో రజనీకాంత్ కి క్లోజ్ గా ఉన్నట్లు యాక్ట్ చేస్తూనే గ్రాడ్యుల్ గా రజనీకాంత్ ని ‘ షో పీస్ ‘ గా మార్చేసి నోమోర్ చేసాడు. తన వ్యూహాల కోసం మురళీకృష్ణకు అధికారాలు కట్టబెటైనట్లు చేసాడు. అధికారం తప్ప బాధ్యత తెలీని మురళీకృష్ణ తెరమీదకు రావడం మరో పక్క అవుట్పుట్ లో టీవీ5, 10టీవీ, ఈటీవీ ల నుంచి సింగారావు తన మనుషుల్ని దింపడం మొదలైంది. టీవీ9 ఫార్మాట్ తెలియని ఈ వ్యక్తులతో రేటింగ్స్ కుప్పకూలాయి. పదిహేడేళ్ళుగా ఒక పటిష్ట మైన వ్యవస్థ తో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న టీవీ9 ఆలాఫ్ సడెన్ గా దేశీ న్యూస్ ఛానల్ ఈటీవీ ఫార్మేట్ కు పడి పోయింది. ఇంత జరుగుతున్నా సింగారావు వ్యవస్థ ని అస్తవ్యస్తం చేయడంలో ఏ మాత్రం తగ్గలేదు. బహుశా యాజమాన్యాన్ని తప్పుదోవ పట్టించినట్లున్నాడు. పదిహేనేళ్లుగా తెలంగాణా జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ గా టీవీ9 విజయాలతో ఉన్న దోంతు రమేష్ ని పక్కనపెట్టి కక్షసాధింపు కు దిగాడు.
రవిప్రకాష్ ఉద్వాసన సంక్షోభంలో సైతం కొత్త యాజమాన్యం వైపు గట్టిగా నిలబడ్డ అవుట్పుట్ ఎడిటర్ చంద్రమౌళిని తొలగించి 10టీవీ నుంచి తన మనుషులను రిక్రూట్ చేసుకున్నాడు. యాజమాన్యాన్నీ చీకట్లో వుంచి వారికేదో ఫేవర్ చేస్తున్నట్లుగా తెలంగాణా బ్యూరోకి రమేష్ ప్లేస్ లో 10టీవీ నుంచి వారి మేనేజమెంట్ సామాజిక వర్గానికి చెందిన తన మనిషిని తెస్తున్నాడని ప్రచారం. బయటినుంచి టీవీ9 పతనాన్ని కోరుతూ కొందరు శత్రువులు విషం చిమ్ముతుంటే సంస్థలోనే ఉంటూ సింగారావు అండ్ కో ఇండైరెక్ట్ గా వారికి ఉపయోగపడుతొందా అనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికైనా టీవీ9 మేనేజమెంట్ అలర్ట్ కాకుంటే సంస్థ స్థానిక మీడియా గా మారడం ఖాయం. తెలుగు ప్రజల కష్టానికి సంతోషానికి అండగా నిలబడ్డ టీవీ9 సజీవంగా, స్వతంత్రంగా ఉండటం ఒక అవసరం. ఒక టీవీ9 అనే కాకుండా ప్రజల పక్షాన బలమైన గొంతు వినిపిస్తున్నఏ మీడియా సంస్థ అయిన పడిపోకూడదు. ఇక్కడ వ్యక్తులను నిందించడం మా ఉద్దేశ్యం కాదు, కొంతమంది వ్యక్తుల వల్ల ఓ గొప్ప సంస్థ ధ్వంసం కావడం అన్యాయం. వ్యవస్థని, ప్రజల పక్షాన నిలబడే మీడియాని కాపాడుకోవడం మా లక్ష్యం.
కె.సి. బాబు – చెన్నై
Comments are closed.