The South9
The news is by your side.

అదరగొట్టిన పవన్ కల్యాణ్ పాట.. 3 కోట్ల వ్యూస్!

post top

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ అగ్రహీరోలలో ఆయనొకరు. ఆయన నటించే సినిమాలు బిజినెస్ పరంగా రికార్డులు కొడుతుంటాయి. అలాంటి పవన్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీలో వచ్చిన ‘పింక్’ ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు శ్రీరాం దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

after image

ఇక ఈ చిత్రంలో ‘మగువా.. మగువా’ అనే పాటను లిరికల్ సాంగుగా ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ సంగీత సారథ్యంలో సిద్ శ్రీరాం ఈ పాటను పాడాడు. ఇప్పుడీ పాట యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 3 కోట్ల (30 మిలియన్లు) వ్యూస్ ను సొంతం చేసుకుని పవన్ కెరీర్లో రికార్డుగా నిలిచింది. అలాగే ఇది 6 లక్షల 86 వేల లైక్స్ ను కూడా పొందడం మరో విశేషం.

ఆరు నెలల గ్యాప్ అనంతరం ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల నుంచి పవన్ షూటింగులో పాల్గొంటారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Tags: Pawan Kalyan, Vakeel Saab, Shruti Hassan, Anjali

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.