The South9
The news is by your side.

శ్రీశైలం పవర్ హౌస్ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

post top
  • శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం 9 మంది మృతి
  • బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న పవన్

తెలంగాణ రాష్ట్ర పరిధిలో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరం అంటూ విచారం వెలిబుచ్చారు. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించడం బాధాకరమని పవన్ పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగానూ, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తన సందేశంలో పేర్కొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.