The South9
The news is by your side.

ధార్శనికుడు, యుగపురుషుడు డా. బాబాసాహేబ్ అంబేడ్కర్

ధార్శనికుడు, యుగపురుషుడు డా. బాబాసాహేబ్ అంబేడ్కర్

నేడు (14.04.2021) డా. బాబాసాహేబ్ బిఆర్ అంబేడ్కర్ 130వ జయంతి*

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. భాభాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి సంధర్భంగా సమసమాజ స్థాపనకై దేశ ప్రజల కోసం బాబాసాహెబ్ చేసిన కృషిని గుర్తుచేసుకోవల్సిన సంధర్భం ఎంతైనా ఉంది.

భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్ సంఘసంస్కర్త, ప్రజాతంత్రవాది. భారత రాజ్యాంగ నిర్మాతగా డా. అంబేడ్కర్ చరిత్రలో స్థిరపడిపొయినా ఈ భహుముఖ ప్రజ్ఞాపాటవాల గురించి చర్చ నడవలేదు. 1927లో హిల్టన్ యంగ్ కమిషన్కు డా. అంబేడ్కర్ ఇచ్చిన మహాజరు ఆధారంగానే రిజర్వు బ్యాంకు విధి విదానాలు రూపుదిద్దుకున్నాయి. భారతీయ ద్రవ్యం, ఆర్ధిక సమస్యలపై ఏర్పడ్డ రాయల్ కమిషన్ అంబేడ్కర్ వ్రాసిన ‘రూపాయి సమస్యలు, పుట్టుక, పరిష్కారం’ అన్న గ్రంధంతో తీవ్రంగా ప్రభావితమైనది. 1934లో భారత రిజర్వు బ్యాంకు చట్టం వచ్చింది. 1942-46 మద్యకాలంలో వైశ్రాయ్ మంత్రిమండలిలో ఆయన కార్మిక, నీటిపారుదల, విద్యుత్ శాఖమంత్రిగా పనిచేశారు. కేంద్ర జలవనరుల సంఘం, దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక వనరులు సమకూర్చటానికి ఉద్దేశించిన కేంద్ర సాంకేతిక విద్యుత్ బోర్డ్కు కూడా ఆయనే ఆద్యుడు.

Post Inner vinod found

డా. అంబేడ్కర్ జీవితాన్ని, కృషిని అధ్యయనం చేసిన వారికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్ధం అవుతాయి. ఆయన దృక్పధం అందరికి సమాన హక్కులు కోరుతుంది. రాజ్యాంగ పరిషత్లో తన చివరి ప్రసంగంలో తన ఆలోచనను మరింత విఫులీకరించారు. ‘మనం సాదించిన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని, సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చలిసిన అవసరం ఉంది. పునాదిలో సామాజిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీజా ప్రజాస్వామ్య మనుగడ సాగించజాలదు” అన్నారు. పధమ న్యాయశాఖ మంత్రిగా మహిళా హక్కులను చట్టబద్దం చేయటానికి ఆయన ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. డా. అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రికాకముందే మహిళా ఉద్దరణ కోసం పని ప్రారంభించారు. లొధియన్ కమిషన్ 1932, విచారణలోనూ 1933-34లో ఏర్పాటైన జాయంట్ సెలెక్ట్ కమిటీ ముందూ మహిళా హక్కుల కోసం వాదించారు. దాని ఫలితంగానే 1935 భారత ప్రభుత్వ చట్టంలో తొలిసారి మహిళలకు ఓటు హక్కు దక్కింది. రాజ్యాంగ ముసాయిదాలో కూడా 14-16 అధికరణాల ద్వారా మహిళలకు పౌర హక్కులు ధాఖలు పర్చటంతో పాటు, కన్యాశుల్కానికి స్వస్తి చెప్పటంలో ఆయనదే ప్రధాన పాత్ర.

స్వాతంత్ర్యానికి ముందే మంత్రివర్గంలో చేరమని డా. అంబేద్కర్‌ను నెహ్రూ ఆహ్వానిచారు. ఆ నాటి హింధూ చట్టం గురించి ఉన్న వేర్వేరు వ్యాఖ్యానాలను క్రోడీకరించి ఒకే చట్టాన్ని దేశం ముందుంచే క్రమంలో డా. అంబేడ్కర్ హిందూస్మృతిని ప్రతిపాదించారు. విప్లవాత్మకమైన ఈ చట్టం మహిళలకు సమాన హక్కులు కల్పించటంతో పాటు కులపరమైన వ్యత్యాసాలకు తావు లేకుండా చేసింది. బీఎన్ రావు కమిటీ ప్రతిపాదించిన ముసాయిదాను పరిశీలించిన ఆయన అనేక ముఖ్యమైన సవరణలతో హిందూ స్మృతి బిల్లు ప్రతిపాదించారు. దీనితో మొదటసారిగా వితంతువులు, కూతుళ్ళు, కొడుకులతో పాటు తండ్రి ఆస్తిలో సమాన హక్కుదారులయ్యారు. గృహహింస లేదా భర్తలు నిర్లక్ష్యం చేయటం కారణంగా భార్యలకు విడాకులు తీసుకునే హక్కు దక్కింది. భర్త రెండో భార్యను పెళ్లాడటాన్ని నిషేదించింది. వేర్వేరు కులాలకు చెందిన స్త్రీ పురుషులు హిందూ చట్టం కింద వివాహమాడే అవకాశం వచ్చింది.

1949లో అప్పటికే అఖిల భారత హిందూ స్మృతి వ్యతిరేక కమిటీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పని ప్రారంభించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆరెస్సస్ డిల్లీలో భారీ భారింగా సభ నిర్వహించింది. 1950-51 మధ్య కాలంలో డా. అంబేడ్కర్, నెహ్రూలు హిందూ స్మృతిని పార్లమెంట్‌లో ఆమోదింపచేయటం కోసం ప్రయత్నించారు. కానీ నిలువెత్తు ప్రతిఘటనలతో బిల్లును పక్కన పెట్టాల్సివచ్చింది. ఇందుకు నిరసన డా. అంబేడ్కర్ మంత్రి మండలికి రాజీనామా చేశారు. భహుశా భారతదేశ చరిత్రలోనే మహిళలకు హక్కులు కల్పించాలన్న డిమాండ్ తో కేంద్రమంత్రి రాజీనామా చెయ్యటం ఇదే తొలి సంఘటన. తొలి సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాదించిన నెహ్రూ హిందూ స్మృతి ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అయితే ఒకే చట్టంగా కాక హిందూ వివాహ చట్టం, దత్తత చట్టం పేర్లతో వివిద భాగాలుగా ప్రవేశపెట్టారు. వీటిని మహిళా సభ్యులతో పాటు విఎన్ గడ్గిల్, పండిట్ ఖజ్రు వంటి సభ్యులు సమర్ధించారు. తరువాత సంస్కరణవాదులు, మితవాదులు అనివార్యంగా బలపర్చాల్సిన పరిస్తితి వచ్చింది. ఈ బిల్లులు 1955-56లో చట్టాల రూపం దాల్చాయి. అనథరం కొంత కాలానికి డా. అంబేడ్కర్ కాలధర్మం చేశారు. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ నెహ్రూ, “హిందూ సమాజంలోనే అన్ని రకాల అణిచివేతతో కూడిన లక్షణాలపై తిరుగుబాటు ప్రకటించిన వ్యక్తిగా డా. అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోతారు. అంతేకాదు, హింధూ స్మృతికి సంభందించి ఆయన ప్రధర్సించిన ఆసక్తి, ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా కూడా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఆయన జీవించి ఉండగానే ఆయన ప్రతిపాదించిన సంస్కరణల్లో అనేకం ఆయన ప్రతిపాదించిన రూపంలో కాకపోయినా వివిధ భాగాలుగా చట్ట రూపం తీసుకోవటం సంతోషకరం” అని ప్రకటించారు.

Post midle

*అంబేడ్కర్ అందరివాడు.. యుగపురుషుడు.. భారతరత్న బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు*

తూతిక శ్రీనివాస విశ్వనాధ్, MBA, LLM, మాజీ సైనికుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యస్.సి కార్పొరేషన్, 7675924666

Post midle

Leave A Reply

Your email address will not be published.