The South9
The news is by your side.

ప్రభాస్ అంటే బాలీవుడ్ బ్యూటీ ఉండాల్సిందే నా

ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. రాధేశ్యామ్ అవ్వగానే సంక్రాంతి సందర్భంగా kgf దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో సలార్ సినిమా నిమొదలెట్టాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ తెలుగు హీరో నే కాదు, మొత్తం భారత దేశ హీరో. తన ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ లాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గత సినిమా సాహో లో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే, అలానే వై జయంతి మూవీస్ లో నటిస్తున్న చిత్రం లో దీపిక పదుకొనె ని కధానాయకి గా ఎంపిక చేశారు. ఇప్పుడు తీస్తున్న సలార్ లో కత్రినాకైఫ్ అని అనుకుంటున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.కత్రినాకైఫ్ గతం లో వెంకటేష్, బాలయ్య బాబు తో నటించింది. ఇప్పుడు ఈ వార్త నిజం అయితే ముచ్చటగా మూడోసారి ప్రభాస్ తో చేస్తున్నట్టు అనుకోవాలి. మొత్తానికి ప్రభాస్ అంటే బాలీవుడ్ హీరోయిన్ ఉండాల్సిందే అనేలా ఉంది.

Post midle

Leave A Reply

Your email address will not be published.