The South9
The news is by your side.

తెలంగాణలో రికార్డు స్థాయిలో కేసులు

post top

హైదరాబాద్: తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 1892 కేసులు కొత్తగా వచ్చాయి.

ఇవాళ నమోదు అయిన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 20462 కు చేరింది. ఇవ్వాళ 8 మంది మరణించగా ఇప్పటి వరకు 283 చనిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1658 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న మొన్నటి వరకు 800-900 కేసులు రాగా అమాంతం పెరిగాయి. ఆ తరువాత రంగారెడ్డి-56, మేడ్చెల్-44, సంగారెడ్డి-20, మహబూబ్ నగర్-12, వరంగల్ రూరల్-41,  నల్గొండ-13 చొప్పున కేసులు నమోదు అయినట్లు తెలంగాణ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

after image

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 9984 కాగా 10195 మంది డిశ్చార్జీ అయ్యారు. ఇవ్వాళ 5965 శాంపిల్స్ టెస్టు చేయగా, 4073 నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,04,118 మందిని పరీక్షించారు.

ఒక ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టులపై ప్రభుత్వం సీరియస్…

ఒక ప్రైవేటు ల్యాబ్ లో మొత్తం 3,726 నమూనాల్లో 2,672 మందికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు ఇచ్చింది. సేకరించిన నమూనాల్లో 71.7 శాతం పాజిటివ్ వచ్చిందని తేల్చింది. ఎక్కువ స్థాయిలో పాజిటివ్ కేసులు రావడంతో ల్యాబ్ ను తనిఖీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీ కి ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ పాజిటివ్ కేసులు రిపోర్టు చేసిన ల్యాబ్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.