అమరావతి: రాజధాని ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలదని, ఎక్కడికీ వెళ్లదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రైతులకు హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
అమరావతి నుంచి రాజధాని తరలించవద్దంటూ రైతులు చేస్తున్న ఆందోళన 200 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆయన తన సంఘీభావాన్ని తెలిపారు. ఒక్కొ ముఖ్యమంత్రి ఒక్కో జిల్లాలో రాజధాని అంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక్కడి నుంచి రాజధాని కదలదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు. అమరావతిపై చేసిన తీర్మానానికి బీజేపీ కట్టుబడి ఉంటుందని సుజనా మరోసారి స్పష్టం చేశారు.
Comments are closed.