The South9
The news is by your side.
after image

కరోనా సమయంలో రోగులకు నాణ్యమైన సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మొదటి ర్యాంకు

post top

నెల్లూరు, 19.10.2020: కరోనా సమయంలో రోగులకు నాణ్యమైన సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మొదటి ర్యాంకు ప్రకడించడంపై.., జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి కోవిడ్ పాజిటివ్ కేసు జిల్లాలోనే నమోదైందని.., జులై నుంచి సెప్టెంబర్ వరకూ జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు తీవ్రంగా నమోదయయ్యాయని.., పాజిటివ్ కేసుల రేట్ 20 నుంచి 30 శాతం వరకూ ఉందని.., అలాంటి పరిస్థితిని ప్రభుత్వం, రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ మేకపాటి గౌతం రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో.., జిల్లా యంత్రాంగం అహర్శిశలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిందన్నారు. ఆ కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు కరోనా రోగులకు నాణ్యమైన సేవలందిచడంలో నంబర్ 1 స్థానాన్ని ఇచ్చిందన్నారు. ఈ ర్యాంకు రావడాన్ని ఓ బాధ్యతగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించడానికి కంకణ బద్ధలమయ్యామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లాకు 7 సంజీవని బస్సులను కేటాయించారని, 3 ఆర్.టి.పి.సి ఆర్ ల్యాబులు ఏర్పాటుకు సహకరించారన్నారు. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా రోజుకు 1000 టెస్టులు చేసే పరిస్థితి నుంచి 7,500 పరీక్షలు చేసేలా స్థాయికి వెళ్లామన్నారు. 24 గంటల్లో వ్యాధి నిర్థారణ ఫలితం ప్రకటిస్తూ.., పాజిటివ్ వ్యక్తులను ఆస్పత్రులకు, క్వారంటైన్ సెంటర్లకు తరలించి మెరుగైన చికిత్స అందించామన్నారు. వృద్ధులను ఆస్పత్రులకు తరలించడంలో ప్రాధాన్యం ఇవ్వడం వలన మరణాలు రేటు తగ్గించామని, కోవిడ్ ఆస్పత్రుల్లో స్పెషల్ వైద్యులతో పాటు.., అన్ని విభాగాల్లో సిబ్బందిని నియమించి మెరుగైన వైద్యం అందించామన్నారు. ప్రాంతీయ కోవిడ్ కేంద్రం జి.జి.హెచ్. నందు 10,000 లీటర్ల ఆక్సిజన్ అందించే ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు.

Post Inner vinod found

750 బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. సీఎం శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఆళ్ల నానిగారి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. కోవిడ్ నివారణ చర్యలలో రెడ్ క్రాస్ సంస్థ వారు, వాలంటీర్లను నియమించి ఎనలేని సేవలందించారన్నారు. ప్లాస్మా దానంలో కూడా జిల్లా దేశంలోనే మెరుగైన స్థానంలో ఉందన్నారు. యువకులు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేశారని, ప్లాస్మా దానం చేసిన వారికి సీఎం గారు ప్రోత్సాహకంగా రూ.5,000 ప్రకటించారని, దానిని వెంటనే అందించామన్నారు. 900 యూనిట్ల ప్లాస్మాని సేకరించామని, చికిత్స ద్వారా కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల ప్రాణాలు రక్షించామన్నారు. జిల్లాలో 95 శాతం రికవరీ రేట్ తో 59,876 మంది ఇప్పటికీ చికిత్స తీసుకుని ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వెళ్లారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి కూడా చికిత్స అందించామన్నారు. హోం ఐసోలేషన్ అవకాశం లేని వారికి 3000 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లలో పౌష్టికాహారం, వైద్యం అందించామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, సచివాలయ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పాటు.., అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు 24 గంటలూ వారియర్స్ లా పనిచేశారన్నారు. 1077 కంట్రోల్ రూం ద్వారా కాల్స్ రిసీవ్ చేసుకుని కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను చికిత్స అందించామన్నారు. మనం- మన పరిశుభ్రత కార్యక్రమం ద్వారా గ్రామాల్లో కోవిడ్ నివారణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.

రాబోయో రోజుల్లో కోవిడ్ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలోని సిబ్బంది ఇదే విధంగా నిబద్ధతో సిబ్బంది పనిచేయాలన్నారు. మాస్కులు తప్పక ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. ప్రస్తుతం 3 శాతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, దీంతో ప్రజలకు కూడా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగంపై నమ్మకం పెరిగిందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి కోవిడ్ రహిత జిల్లాగా చేయాలని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ ఎన్.ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ సహకారంతో కోవిడ్ నివారణ చర్యలలో కీలకపాత్ర పోషించారని వారిని ప్రత్యేకంగా కలెక్టర్ అభినందించారు. కోవిడ్ మహమ్మారి నివారణ చర్యలలో పాల్గొంటూ వైద్యులు, నర్సులు, పోలీసు సిబ్బంది మరణించారని, వారి కుటుంబాలకు ప్రగాడ సంతాపం వ్యక్తం చేస్తున్నాన్నారు. వారి కుటుంబాలు త్వరిత గతిన 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందిస్తామన్నారు. కోవిడ్ నివారణ చర్యలలో మీడియా సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న నివారణ చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లారన్నారని.. ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని పరిశ్రమలు కోవిడ్ ప్రోటోకాల్ చర్యల్లో పాల్గొనడంతోనే కాకుండా.., కోటి 50 లక్షల రూపాయల వరకు సహాయం అందించారని, వీటి ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగపర్చామని, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జి.జి.హెచ్.లోని ప్రసూతి వైద్య విభాగం కోవిడ్ సమయంలో 2395 గర్బిణీ స్త్రీలకు డెలివరీలు చేశారని, అందులోనూ కోవిడ్ పాజిటివ్ వచ్చిన 56 మంది గర్బిణిలకు డెలివరీలు చేశారన్నారు. రాష్ట్ర స్థాయిలోనే జిల్లాను నంబర్ 1 స్థానంలో నిలిపారన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాన్నారు.

Post midle

Comments are closed.