- నెల్లూరు జిల్లాలో కరోనా మరణాలు లేకపోవడం మంచిపరిణామం : మంత్రి మేకపాటి
- కలెక్టర్, ఎస్పీ, సూపరింటెండెంట్, డీఎమ్ హెచ్ వో, జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు
- పారిశుద్ధ్య కార్మికులు,వాలంటీర్లు, వైద్యులు, పాత్రికేయులు సహా ప్రతి ఒక్కరి కృషీ ప్రశంసనీయం
అమరావతి, అక్టోబర్, 16; శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా మరణాలు లేకపోవడం మంచిపరిణామమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్ నెలలోనే మూడు సార్లు మరణాలు నమోదు కాకపోవడం వెనుక జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషిని మంత్రి మేకపాటి అభినందించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో నిరంతరాయంగా విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు, వైద్యులు, పాత్రికేయులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్, డీఎమ్ హెచ్ వో రాజ్యలక్ష్మి సహా అధికారుల సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారం, ఎన్జీవోల సాయం, ప్రజల సహకారం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి వెల్లడించారు.
వెయ్యికి పైగా కేసులు నిత్యం నమోదు అవుతున్న స్థాయి నుంచి రెండువందల లోపే కేసులు నమోదవుతుండడం..ముఖ్యమంత్రి , ప్రభుత్వ యంత్రాంగం నిరుపమాన కృషికి నిదర్శనమని మంత్రి తెలిపారు. ఇదే విధంగా మరింత కృషి చేసి జిల్లాలో కేసుల నమోదు కూడా లేకుండా చేయాలని మంత్రి కోరారు. ప్రజలు మాత్రం వ్యాక్సిన్ వచ్చేవరకూ అశ్రద్ధ చేయకుండా..అప్రమత్తంగా మెలగడం అవసరమని మంత్రి మేకపాటి వెల్లడించారు. గురువారం ఎవరూ చనిపోలేదని, శుక్రవారం కూడా ఇతర కారణాల వల్ల ఒకరు మాత్రం మృతి చెందినట్లు డీఎం హెచ్ వో రాజ్యలక్ష్మి తెలిపారు.
Comments are closed.