నెల్లూరు నగరం లోని ప్రముఖ న్యాయవాది, ఐలు నాయకులు మనపాటి సాల్మన్, దసౌత్9 మేగజైన్, తన్వి మీడియా అధినేత మనపాటి చక్రవర్తి సోదరులు మనపాటి వినోద్ కుమార్ (లేట్)జన్మదిన సందర్భంగా నెల్లూరు లోని స్వర్ణ దీపిక అంధుల ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం జరిగింది. వినోద్ అకాల మరణం తో ఆయన పేరు మీద వారి కుటుంబ సభ్యులు ‘వినోద్ ఫౌండేషన్’అనే సంస్థ స్థాపంచి గత 4 సం, లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ రోజు వినోద్ కుమార్ జన్మదిన సందర్భంగా స్థానిక అంధుల ఆశ్రమం లో పుట్టినరోజు ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా 5 నగర సర్కల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు చేతుల మీదగా ఈ కార్యక్రమం జరిగింది. సిఐ సుబ్బారావు మాట్లాడుతూ ఈ తుఫాన్ సమయంలో ఈ అంధుల ఆశ్రమం లోని వారికి చక్రవర్తి వారి తమ్ముడు వినోద్ పేరు మీద అందరికి భోజనం ఏర్పాటు చేయడం చాలా మంచిదని అన్నారు.వినోద్ ఫౌండేషన్ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా మును ముందు కూడా చేయాలని వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ చక్రవర్తి ని కోరి,ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినoదుకు అభినందించారు.ఈకార్యక్రమంలో మరొక సి. ఐ. బి. శ్రీనివాస్ రెడ్డి,మేఘన ఎంటర్ ప్రైజస్ ఎండీ కేసీ బాబు, వైస్సార్సీపీ నాయకులు రాము, శీను, కిషోర్, సురేష్,ఫోటో గ్రఫర్ శివ ఆశ్రయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.