గత కొంత కాలంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెల్లెలు వైయస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు కొన్ని మీడియా లో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఒక ప్రముఖ దినపత్రిక మరియు ఛానల్ ఈ వార్తపై కథనం ప్రసారం చేయడంతో పాటు ప్రముఖంగా ప్రచురించాయి. అయితే ఈ వార్తలపై వైయస్ షర్మిల తీవ్రంగా తన ఖండనను తెలియజేశారు. పత్రికలకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. వైయస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసే దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక ఛానల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన వార్తలు రాయడం తప్పు అని దీనిమీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో తెలియజేశారు అయితే రేపు లోటస్ పాండ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు తోను ఒక సమావేశం నిర్వహిస్తున్నారని దానికి అభిమానులు, శ్రేయోభిలాషులు, రావాలని స్వయంగా టెలిఫోన్ ద్వారా వైయస్ షర్మిల ఆహ్వానిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం?అయితేఈ వార్త ఎంతవరకు నిజం అనేది రేపటి వరకు వేచి చూడవలసిందే.
