The South9
The news is by your side.
after image

వైసీపీ ప్రభుత్వంలో కులగజ్జి: సీపీఐ విమర్శ

post top

గుంటూరు: ఏదైనా విషయంపై మేం మాట్లాడితే కమ్యూనిస్టులు కాదు కమ్మనిస్టులు అని కులం పేరుతో తిడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
మాకు కులం అంటగట్టే ముందు మీ పార్టీలో పదవులు ఎవరికీ ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండని ఆయన హితవు పలికారు.

Post Inner vinod found

సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ.సుబ్బారెడ్డి బాధ్యతలు అప్పగించారని, మీ పార్టీలో వేరే కులాల వారు లేరా.. వారు పదవులకు పనికి రారా అని రామకృష్ణ ప్రశ్నించారు.
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పాలక మండళ్లు అంతా మీ బంధువులే ఉన్నారని, 70 మందిలో 46 మంది మీ కులం వారే ఉన్నారు కదా! ఆయన అన్నారు. సెర్చి కమిటీల్లో 12 మందికి 9 మంది రెడ్లకే ఇచ్చారని అన్నారు. ధర్మాన, పిల్లి సుభాష్ చంద్రబోస్, అంబటి రాంబాబు, పార్థసారథి వంటి వారు పదవులకు పనికిరారా?. ఎస్సీ నాయకులు పదవులకు అనర్హులా జగన్ చెప్పాలన్నారు. సామాజిక న్యాయం అంటూ పదేపదే చెప్పే జగన్… మీ పార్టీలో సామాజిక న్యాయం లేదని తెలియదా అని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెత్తందారీతనం నడుస్తోందని, ముగ్గురు, నలుగురే ప్రభుత్వాన్ని మొత్తం నడిపిస్తున్నారన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రితో మాట్లాడే పరిస్థితి ఉందా? అని ఆయన లేవనెత్తారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రెండు అవాస్తవాలు మాట్లాడారని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లు విషయంలో కేంద్ర మంత్రి ఓ మాట.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయ రెడ్డి కల్లం ఓ మాట చెప్పారన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటే.. కేంద్ర మంత్రి మాటలకు మీ పరువు పోదా? అని ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ మాటలు అబద్ధం అయితే ఎందుకు కేసు పెట్టడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కరోనా రాష్ట్రంలోనూ దేశంలోనూ తీవ్రంగా విజృంభిస్తోందన్నారు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, అడ్డగోలు విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయన్నారు. రాజధాని భూముల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

అమరావతి జేఏసి నిర్ణయాలకు సీపీఐ సంపూర్ణ మద్దతిస్తోందన్నారు. దశాబ్దాలుగా దళితులు అనుభవిస్తున్న భూములను పేదల ఇళ్ల స్థలాల పేరిట లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించుకోవటం సాధ్యమా? అని ఆయన అడిగారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని నాగేశ్వరరావు అన్నారు.

Post midle

Comments are closed.