
ఢిల్లీ: గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న చైనా దేశానికి వరుసగా చెక్ లు పడుతున్నాయి. తాజాగా హైవే ప్రాజెక్టుల్లో చైనా సంబంధిత కంపెనీలను అనుమతించడం లేదని కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

గత కొద్ది రోజులుగా ఇండియా – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిలో ఇండియా సైనికులు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 59 చైనా యాప్ లను భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక నుంచి దేశంలో జాయింట్ వెంచర్లు, హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను అనుమతించమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈల్లో కూడా చైనా పెట్టుబడులు అనుమంతిచడం లేదని ఆయన తెలిపారు.
Comments are closed.