ఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇలాంటి వైరస్ లు, బ్యాక్టీరీయాల కారణంగా ఓటింగ్ కు ఇబ్బందులు ఉండకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది.
65 సంవత్సరాల పైబడిన వృద్ధులతో పాటు కరోనా బాధితులు, హోం క్వారంటైన్ లో ఉన్నవారు పోలింగ్ బూతులకు వెళ్లి ఓటు వేయాల్సిన అవసరం ఉండదు. పోస్టల్ బ్యాలెట్ సహాయంతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ఏడాది చివరిలో బిహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో ఓటర్లు పెద్ద ఎత్తున లైన్‌లో నిలుచోవడం కరోనా వ్యాప్తి కారణమవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలన సిబ్బంది, పోలీసులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే అవకాశం ఉంది.
Comments are closed.