The South9
The news is by your side.

ఆన్ లైన్ క్లాసులపై దాగుడుమూతలా?: హైకోర్టు

post top

హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం దాగుడుమూతలు ఆడకూడదంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ తరగతుల నిర్వహణ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంవత్సరం మొదలు కాక ముందే ఆన్ లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిచింది. ఓవైపు అనుమతి ఇవ్వలేదంటూనే మరోవైపు వాటిని అడ్డుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించింది.

after image

ప్రభుత్వం ఇలాంటి ధ్వంద్వ వైఖరితో దాగుడు మూతలు ఆడకూడదని అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర మాదిరిగా స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోరని ప్రశ్నించింది. ఈ నెల 31వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం స్పష్టం చేసిందని, ఈ నెల తర్వాతే విద్యా సంవత్సరం పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆన్ లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుందని ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల కెరీర్ కోసం, తరగతులు జరగకపోతే కెరీర్ స్తంభిస్తుందనే నెల రోజులుగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నామంటూ.. విద్యా సంస్థల తరఫు న్యాయవాది తెలిపారు.

ఒక్కో ఇంట్లో రెండు మూడు ల్యాప్ టాప్ లు కొనే పరిస్థితి ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికింది. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. న్యాయవ్యవస్థ తో పాటు ప్రపంచ మానవాళి జీవితమే స్తంభించిందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్ సిటీఈని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. కేంద్రం, సీబీఎస్ఈ వాదనలు కూడా వింటామన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది,

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.