తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సెప్టెంబర్ 17ను కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామన్న కేసీఆర్, సీఎం అయ్యాక ఆ హామీని విస్మరించారు కేసీఆర్ ఎన్నికల ముందు ఒక విధానం, ఎన్నికల తర్వాత మరో విధానం వ్యవహరిస్తున్నారు.
మజ్లీస్‌పై ప్రేమతో నయా ఖాసీం రజ్వీలా కేసీఆర్ వ్యవహరిస్తూన్నారు. తెలంగాణ ప్రజలను అనేక కష్టనష్టాలకు గురిచేసిన నిజాంను గద్దెదింపి, హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కల్పించడంలో ఎంతో మంది మహనీయుల పాత్ర ఉంది
సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన పోలీసు చర్య, తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబరు 17న నిజమైన స్వాతంత్య్రం తెచ్చిపెట్టిందన్న విషయాన్ని విస్మరించారాదు.
తెలంగాణ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామన్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తాం.
Comments are closed.