The South9
The news is by your side.
after image

పొగాకును ప్రభుత్వమే కొంటుంది: కన్నబాబు

post top

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వమే పొగాకును కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపడుతుందని తెలిపారు. మార్క్ ఫెడ్ ద్వారా ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్టు తెలిపారు. రేపటి నుంచి కొనుగోళ్లు ప్రారంభమౌతాయని తెలిపారు.

Post Inner vinod found

రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఒంగోలులోని 1, 2 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. క్రమంగా అన్ని ప్రాంతాల్లోనూ కొనుగోళ్లు చేపడతామని తెలిపారు. F3 , f4, f 5, f 8, f 9 లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తాంమన్నారు. పొగాకు బోర్డు చెప్పిన దాని కంటే అధిక మొత్తానికి కొనుగోళ్లు చేపడతామని పొగాకు రైతులకు హామీ ఇచ్చారు.

Post midle

Comments are closed.