The South9
The news is by your side.

తెలంగాణలో మోదీ జోక్యం చేసుకోవాలి: రేవంత్ రెడ్డి

post top

హైదరాబాద్: రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డిపై జోక్యం చేసుకోవాలని ప్ర‌ధాని నరేంద్ర మోదీకి మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ఉధృతి పెరిగిపోతున్నదని, దేశంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని, త్వరలోనే కరోనా హాట్ స్పాట్ గా మారనున్నదని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను, హైకోర్టు ఆదేశాల‌ను, ఐసీఎంఆర్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఏమాత్రం లెక్క చేయడం లేదని ఆయన ఆరోపించారు. దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో ఒక‌టైన హైద‌రాబాద్ ప‌రిస్థితి దారుణంగా మారుతున్నందున వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరారు.
మ‌హారాష్ట్రలో క‌రోనా పాజిటివ్ రేటు 22శాతం ఉండగా తెలంగాణ‌లో 27శాతం ఉంద‌ని అన్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 70వేల టెస్టులు మాత్ర‌మే జ‌రిగాయ‌ని, అదే ప‌క్క‌నున్న ఏపీలో 6ల‌క్ష‌ల వ‌ర‌కు టెస్టులు చేశారని తెలిపారు. ఇక గ‌త నాలుగు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ లో నమూనాలు కూడా సేకరిండం లేదని అన్నారు.

after image

రిపోర్టులు రాక… ఈలోపు వ్యాధి ముదిరి, మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుంద‌న్నారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుప‌త్రి అలంకారప్రాయంగా మాత్ర‌మే ఉంద‌ని, కోవిడ్ స్పెషాలిటీ ఆసుప‌త్రిగా ఉన్న గాంధీలో తీవ్ర స‌మ‌స్య‌లున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీలున్న‌ప్ప‌టికీ క‌రోనాపై పోరులో వాటిని వాడుకోవ‌టం లేద‌ని విమ‌ర్శించారు. వెంట‌నే వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనాపై పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఎం కేసీఆర్ బంధువులు, మంత్రులు, వారి బంధువుల‌కు చెంద‌టంతో వాటిని ఉప‌యోగించుకోవ‌టం లేద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌ధానికి రాసిన లేఖలో లేవనెత్తారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.