రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు కనబడటం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టానురీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలు తమను ఎదిరించి మాట్లాడకూడదనే భావనలో వైసీపీ ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలు తీరు మార్చుకోకపోతే తాము సహనాన్ని కోల్పోతామని అన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనీ, ఎవరు ఎదిరించినా, వ్యతిరేకంగా మాట్లాడినా, మీడియాలో వచ్చినా కేసులు పెడుతున్నారని వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోవాలని లేకుంటే భవిష్యత్తు లో జనసేన కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు.
తిరుపతిలో నిర్వహించిన తొలి పిఏసి సమావేశంలో ఆలయాలపై జరిగిన దాడులపై చర్చించామన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని వాటిపై తాము ఆచిచూసి స్పందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 142 పైగా ఘటనలు జరిగాయనీ, అన్నారు.
Comments are closed.