The South9
The news is by your side.

పెట్రోల్ లేదంటే గ్యాస్ పై బాదుడే బాదుడు..

post top

ఢిల్లీ: నిన్నటి వరకు పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుకుంటూ వెళ్లిన కేంద్ర ప్రభుత్వం దానికి విరామం ఇచ్చింది. ఇవాళ ఎల్పీజీ సిలిండర్లను పెంచేసి మళ్లీ బాదుడు మొదలు పెట్టింది.
అయితే పెట్రోల్, డీజీల్ లేదంటే ఎల్పీజీ సిలిండర్లపై ధరలను పెంచుతున్నారంటూ మధ్య తరగతి ప్రజలు భగ్గుమంటున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా దేశంలో వంటగ్యాస్ రేట్లను క్రమబద్ధీకరిస్తూ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ ధరను పెట్రోలియం కంపెనీలు పెంచేశాయి.
గత నెలలో ఇలాగే ధర పెంచిన కంపెనీలు… మళ్లీ జులై రాగానే మరోసారి పెంచుడు ప్రారంభించాయి. ఇండియన్ ఆయిల్‌ కంపెనీకి చెందిన 14.2 కేజీల సిలిండర్ (సబ్సిడీ కానిది) ఇండేన్, ఇప్పుడు ఢిల్లీ, ముంబైలో రూ.594 రూపాయలు అయ్యింది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1 పెరగగా… ముంబైలో రూ.3.5 పెరిగింది.

after image

గత నెల్లో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్‌పై ధరను రూ.11.50 పెంచారు. అంతకు ముందు వరుసగా మూడు నెలల పాటూ ధర తగ్గించడంతో… అప్పట్లో సిలిండర్ ధర రూ.277కే లభించింది. ఫిబ్రవరిలో ధర ఏకంగా రూ.858కి పెరిగింది. మార్చి, ఏప్రిల్, మే నెలలో… కరోనా వల్ల ధర తగ్గించడంతో రూ.581కి చేరింది. ఇప్పుడు ఏకంగా రూ.594కి చేరుకున్నది.
ఇక హైదరాబాద్‌లో జూన్‌లో సబ్సిడీ యేతర సిలిండర్ ధర రూ.641గా ఉండగా… ఇప్పుడు అది రూ.4.5 పెరిగి రూ.645.50 చేరుకున్నది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.