కొలకత్తా: పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పై కొందరు వ్యక్తులు భౌతికంగా దాడి చేశారు. ఆపై ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు.
ఇవాళ ఆయన కోచ్ పుకూర్ గ్రామానికి బయలుదేరారు. అక్కడికి వెళ్లక ముందే టీఎంసీ కార్యక్తరలు తనను అడ్డుకున్నారని దిలీప్ తెలిపారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై, తనపై దాడికి తెగబడ్డారని ఆయన అన్నారు. ఈ దాడిలో తన వాహనం ధ్వంసమయిందన్నారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడినైన తనపై దాడి చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందని ఆయన చెప్పారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చినప్పటికీ వారు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆయన ఆరోపించారు.
Comments are closed.