అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తన క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఔట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 47 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగం రావడానికి లంచాలు, జీతం రావాలన్నా లంచాలు పెట్టాల్సి వచ్చేదని అన్నారు.
ఉద్యోగులను దోచుకొని కంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే విధానాలే ఇప్పటివరకు ఉన్నాయన్నారు. పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. ఆప్కోస్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నట్టు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని అన్నారు. ఈ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.
Comments are closed.