కులానికి-మతానికి-రాజకీయాధికారానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ అనుబంధం ఈమధ్య మరింత పెనవేసుకుపోయింది. తెలంగాణాలో టీఆరెస్ వల్ల అధికారం కోల్పోయిన కాంగ్రెస్ రెడ్లు, బీజేపీ నాయకులు అయిపోయారు. వైఎస్సార్సీపీ వల్ల నష్టపోయిన తెలుగుదేశం కమ్మలు బీజేపీలో చేరిపోయారు. అధికారం కోసం అర్రులు చాస్తున్న కాపులు జనసేన పేరుతో బీజేపీతో కంఫర్టబుల్ గా అంటకాగడానికి రెడీగా ఉన్నారు.
రెడ్డి, కమ్మ,కాపు కులాలు అగ్రకులాలుగా చెప్పుకోబడే అధికారకులాలు. మతంద్వారా ఏర్పడిన కులం ఆధారంగా సామాజిక-ఆర్ధిక-రాజకీయాధికారాన్ని ఎంజాయ్ చేస్తున్న కులాలు. అధికారాన్ని నిలుపుకోవడానికి మతాన్ని వాడటం అనే బీజేపీ పంథాని సహజంగా అందిపుచ్చుకునే లక్షణం కలవాళ్ళు. కాబట్టి తెలంగాణాలో పెరిగినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఈ మతతత్వం పెరగదు అనే భ్రమలో ఎవరూ ఉండనక్కరలేదు. రెండు సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయి అని తిరుపతిలో వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎప్పటి నుంచో ఆ అజెండా అమలు చేస్తోంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముస్లిం,క్రైస్తవులతోపాటు…హిందువులు కూడా అతిజాగ్రత్తగా ఉండాలి. బలయ్యేది మన అందరిలోని సామాన్యులే!.
Comments are closed.