
ఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ, ఖరీదైన కార్లలో ఒకటైన ఫెరారీ కారును హైదరాబాద్ కార్కాణా దగ్గర ఓ ఇంట్లో పార్క్ చేసి ఉండగా ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఆ కారును మహిదిపట్నం టోలీచోకి వద్ద ఏకంగా కోటిన్నరకు అమ్మాలని కూడా ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

వివరాల్లోకెళితే.. ఫెరారీ కారును దొంగిలించారన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే ఆ కారును స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ కారును చోరీ చేసేందుకు నిందితులు ఢిల్లీ నుంచి విమానంలో వచ్చి పార్క్ హయత్ హోటల్ లో బస చేసినట్టు పోలీసులు గుర్తించారు.
Comments are closed.