The South9
The news is by your side.

వచ్చేనెల 15న కరోనా వ్యాక్సిన్

post top

హైదరాబాద్ కేంద్రంగా తయారీ
ఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తో కలిసి ఐసీఎంఆర్ కోవాక్సిన్ పేరుతో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది.

after image

అన్నీ అనుకున్నట్లుగా ముందుకు సాగితే స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న మార్కెట్ లోకి విడుదల చేస్తామని తెలిపింది. జంతువులపై ప్రయోగంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం మానవులపై ప్రయోగాలు జరుగుతున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. ఇందులో భాగంగా భారత్‌ బయోటెక్‌ క్లినికల్ ట్రయల్స్‌ను ముమ్మరం చేసింది. ఏదేమైనా క్లినికల్ ట్రయల్స్‌ అన్నీ విజయవంతంగా పూర్తైన తరువాతే వ్యాక్సిన్‌ని మార్కెట్‌లోని విడుదల చేస్తామని ఐసీఎంఆర్, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. పూర్తి స్వదేశీ పరిఙ్ఞానంతోనే ఈ వ్యాక్సిన్‌ రాబోతుంది.
క్లినికల్ టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 12 ఇనిస్టిట్యూట్‌లను ఐసీఎంఆర్‌ ఎంపిక చేసింది. వ్యాక్సిన్‌ పనితీరును ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. మానవులపై పనితీరును కూడా పర్యవేక్షిస్తున్నారు. మానవులపై ప్రయోగాలు విజయవంతమైతే కరోనా మహమ్మారితో దేశ ప్రజలకు భారీ ఊరట లభించినట్లే. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వారెవరికీ కరోనా సోకే ప్రమాదం ఉండదు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.