The South9
The news is by your side.
after image

అదృశ్యమైన బాలిక.. అత్యాచారాని గురై హతం

post top

చెన్నై: రెండ్రోజుల క్రితం అదృశ్యమైన బాలిక అత్యాచారానికి గురై హతమైన దారుణ ఘటన తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అరంతాంగి గ్రామంలో ఓ బాలిక(7) రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Post Inner vinod found

ఈ క్రమంలోనే ఆ గ్రామంలోని చెరువు దగ్గర తీవ్ర గాయాలతో ఆ బాలిక మృతదేహం లభ్యమవడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. ఆ బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ యువకున్ని(నిందితున్ని) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను తమిళనాడు సీఎం పళనిస్వామి తీవ్రంగా ఖండించారు. బాలిక కుంటుంబానికి తప్పకుండ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Post midle

Comments are closed.